సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో నేడు, మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. పాలకోడేరు మండలంలోని వంకాయల పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు సీసీ రోడ్డులను, విస్సాకోడేరులో అనాథ శిశువుల సంరక్షణ కోసం “శిశు గృహ’ భవనాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భముగా రఘురామా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు సమగ్ర బాలల సంరక్షణ పథకం క్రింద పశ్చిమ గోదావరి జిల్లాకు గాను తన నియోజకవర్గంలోని పాలకోడేరు మండలం, విస్సాకోడేరు గ్రామంలో ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. అనంతరం విస్సాకోడేరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, గ్రామంలోని పలువురు వృద్ధులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమాలలో పాల్గొని రఘురామకు అబినందనలు తెలిపారు. కొత్తపల్లి నాగరాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
