సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుతున్న క్రమ శిక్షణ అలవాటు చేసుకొని టీడీపీ ఎమ్మెల్యేలపై ఇక సీఎం చంద్రబాబు కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఇటీవల పేదలకు ప్రభుత్వ పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్‌ల అందజేత కార్యక్రమాల్లో పొల్గొనని రాష్ట్రంలోని 48 మంది ఎమ్మెల్యేలకు నోటిసులు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రొగ్రాం కమిటీకి ఆదేశించారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో బ్యాక్ ఆఫీసు, ప్రోగ్రాం కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల నిర్లక్ష తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తరువాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా తమకు సిన్సియర్ గా పనిచేసిన కార్యకర్తలను కూడా కలుపుకొని వెళ్లాలని అన్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఙప్తుల దినంలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని ఆదేశించారు.
