సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో సీఎం చంద్రబాబు పర్యటన వాయిదా పడిందని నేడు, సోమవారం నియోజకవర్గ టీడీపీ పార్టీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు తణుకు వచ్చి ప్రభుత్వ పధకాల కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తగిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న తరుణంలో ఆయన పర్యటన వాయిదా పడినట్లు సమాచారం అందింది.
