సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ భీమవరం పర్యటన ఖరారు అయినా నేపథ్యంలో .. నేటి సోమవారం సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని శాసన మండలి చైర్మన్ ,కొయ్యే మోషేను రాజు మరియు వారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు మర్యాద పూర్వకంగా కలిశారు, ఈ సందర్బంగా భీమవరం పరిసర ప్రాంతాలలో ఉన్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి కి విన్నతి పత్రం అందచేసి వాటిపై చర్చించారు.ముఖ్యముగా ఇటీవలే దొమ్మేరు కు చెందిన బొంత మహేంద్ర విషయం గురించి చర్చించినట్లు సమాచారం. మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అలాగే బాధిత కుటుంబానికి 10 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగము, ఇంటి స్థలము కూడా ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చైర్మన్ కొయ్యే మోషేను రాజు కు హామీ ఇచ్చినట్లు సమాచారం..శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు జన్మదినం నేపథ్యంలో రేపు మంగళవారం ఉదయం 9గంటల నుండి భీమవరం గునుపూడిలోని ఆయన గృహంలో అభిమానులకు అందుబాటులో ఉంటారు,
