సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టీడీపీ జనసేన తదితర ప్రతిపక్ష పార్టీలు ఏపీలో బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని తెలంగాణ కు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. నేడు, ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 29వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. బీసీల చైతన్యం కోసం ఏపీ వ్యాప్తంగా పర్యటించానని తెలిపారు. త్వరలోనే 4 లక్షల మందితో ఉత్తరాంధ్రలో బీసీ సభను నిర్వహిస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారని.. జగన్ కాకుండా ఎవరైనా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారన్నారు.బీసీలను పట్టించుకోరని అన్నారు. జగన్ రాజకీయ వేత్త కాదు, గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కే బీసీలు ఓట్లు వేయాలన్నారు. 151 పైగా స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పారు. జగన్‌ని మళ్లీ అధికారలోకి తేవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల వర్గాలపై ఉందని ఆర్ కృష్ణయ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *