సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల లో ఒకటి బీసీ కి చెందిన కవురు శ్రీనివాస్ కు కేటాయించగా , కాపు సామాజిక వర్గానికి చెందిన ‘జుట్టు’ పరిశ్రమలలో విదేశీ ఎగుమతులలో జాతీయస్థాయి ఖ్యాతి గాంచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వంక రవీంద్రనాథ్ పేర్లను ప్రకటించారు. వైసిపి పార్టీ ఆవిర్భావం నుండి ఆయన జగన్ వెంట నడిచారు. 2014లో వైసిపి పార్టీ తరపున నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వంక రవీంద్రనాథ్ పోటీ చేసి పరాజయం పాలయ్యా రు. అయినప్పటికీ పార్టీని అంటి పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగిన పాల్గొంటూ వచ్చారు. తదుపరి రాజమహేంద్రవరం పార్లమెం ట్ నియోజకవర్గ రాజకీయ పరిశీలకుడిగా పనిచేసారు. జగన్ సీఎంగా అధికారంలోకి వచ్చాక గత రెండేళ్ల కిందట కీలకమైన రాష్ట్ర చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్చైర్మెన్ పదవి వరించింది. ఇప్పడు వైసిపి ఎమ్మెల్సీ గా మారనున్నారు. తాను పడ్డ కష్టం మరచిపోకుండా సరైన సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్ కు కృతఙ్ఞతలు తెలిపారు వంకా రవీందర్.. గత 6 ఏళ్లుగా సిగ్మా ఆన్ లైన్ న్యూస్ వీక్షకుడిగా ప్రత్యేక అనుబంధం కలిగిన వంకా రవీందర్ కు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *