సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 21న సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తణుకులో జిల్లా ఇన్‌చార్జ్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, స్థానిక ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, జి.శ్రీనివాసనాయుడు, ఎమ్మెల్సీ రఘురాం, పాతపాటి సర్రాజు, వంకా రవీంద్రనాథ్ తదితరులు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మంగళవారం రోజు, తణుకు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది కాబ్బటి అక్కడి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఇంకా స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికా రులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం బహిరంగ సభకు సుమారు 75 వేల మంది పైగా హాజరు అవుతారని వారు భావిస్తున్నారు. వచ్చే వారికీ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సభా ప్రాంగణంలో వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్స్ లను, మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలిం చారు.
