సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ సీఎం జగన్‌ నేటి సోమవారం ఢిల్లీ పర్యటన అనూహ్యంగా వాయిదాపడింది. ఆయన నేటి సోమవారం సాయంత్రం బయలుదేరిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే గన్నవరం ఎయిర్‌పోర్టు లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే సీఎం జగన్ రేపు మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సమావేశానికి వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలను రేపు ఉదయం రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సమావేశం రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. ఈ సమావేశానంతరం ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌షాను, నిర్మల సీతారామన్ లను సీఎం జగన్ తన అవకాశం బట్టి వారిని కలిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *