సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రజల కోసం కంటే భారత్ లో అలజడి కోసం ఉగ్రవాదులను తయారు చెయ్యడానికే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టె పాకిస్తాన్ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. స్థానిక ప్రజలు ఆకలి కేకలతో దుర్భర జీవితం గడుపుతుంటే మరోప్రక్క ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా నేడు, సోమవారం పెషావర్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణాల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. ఇప్పటికే 46 మంది అమాయకులు చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పెషావర్‌లోని ప్రధాన ఆసుపత్రిలో ఎటు చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. మరోప్రక్క మరోప్రక్క ధరలు ఆకాశాన్ని అంటుకొంటున్నాయి.తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర 249, లీటర్ డీజిల్ ధర 262 రూపాయలకు పెరిగింది. మరోవైపు నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో. డాలర్ మారకంలో దేశ కరెన్సీ విలువ ఇంతకు ముందెన్నడూ లేని కనిష్ఠం రూ.262.2 స్థాయికి దిగజారింది. ఐఎంఎఫ్ నుంచి నిధులను పొందడానికి విధించిన షరతుల మేరకు డాలర్-రూపాయి మారకపు రేటుపై ప్రభుత్వం పరిమితులను తొలగించడం పాక్ రూపాయి విలువ క్షీణతకు దారితీస్తోంది. మరో ప్రక్క కరాచీ పోర్టుల్లో బకాయిల చెల్లింపుల కోసం 9వేలకు పైగా కంటైనర్లు నిలిచిపోయాయి. ఇదిలాఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సహాయక బృందాలను పంపించేందుకు నిరాకరించింది.
