సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గతంలో జగన్ సీఎం గా ఉన్నపుడు చిరంజీవి మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు కలసినప్పుడు జగన్ ప్రవర్తన అవమానకరం అని, అన్నయ్య చిరంజీవి జగన్ కు నమస్కారం పెట్టడం తనను బాధించిందని , తమను ఇబ్బంది పెట్టడానికే జగన్ టికెట్స్ రేట్లు పెంపును అడ్డుకొని సినీ పెద్దలను తనవద్దకు రప్పించుకొన్నాడని .. సినిమాకు నష్టం తెస్తున్నారని విమర్శించిన ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎట్టకేలకు తొలిసారిగా నేడు, సోమవారం మీడియా ముందు మాట్లాడుతూ.. తెలంగాణలో సినీ పెద్దలతో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, టికెట్స్ రేట్లు పెంచేది లేదని తేల్చి చెప్పడం, అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యు ఫై స్వాందించారు. పవన్ మాట్లాడుతూ..అల్లు అర్జున వ్యవహారం గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడని.. అయన ప్రజల పక్షాన మాట్లాడుతున్నారని, ఆయన కింద నుంచి ఎదిగారన్నారు. గతంలో వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని తెలిపారు. అల్లు అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అయితే ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు. ఈ విషయంలో థియేటర్ కు రావద్దని స్టాఫ్అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక… త్రొక్కిసలాటలో మహిళా మృతి ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో.? అల్లు అర్జున్ తరపున ఒకరు బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపీంచిందని అన్నారు. సీఎం లాంటి పెద్దలను కలసినప్పుడు వారి గురించి మాట్లాడేటప్పుడు అభివాదం చేయకపోతే..ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. సినిమా అంటే టీం… అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం’’ అని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ తాజా వ్యాక్యలు అల్లు అర్జున్ కు మద్దతుగా నిలచిన తెలంగాణ బీజేపీ ఎంపీలను కేంద్ర మంత్రులను ఇబ్బందులలోకి నెట్టాయి.
