సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంకా 2 నెలల్లో ఎన్నికలు.. ఇప్పటివరకు టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్ట్ బయటకు రాలేదు. ఇది ఇరు పార్టీల క్యాడర్ లో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇరుపార్టీలలో అవగాహన కుదరక ఒంటరిగా బరిలో దిగుతారు అన్న మాట కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు, ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఉండవల్లి లోని చంద్రబాబు గెస్ట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ తో సమావేశం 3గంటల పైగా సుదీర్ఘంగా కొనసాగింది. తరువాత పవన్ ఏ ప్రకటన చెయ్యకుండా మంగళగిరిలో తమ పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడ సాయంత్రం వైసిపి నుండి బయటకు వచ్చిన ఎంపీ బాలసౌరి జనసేన లో చేరే కార్యక్రమం జరుగుతుంది. నిజానికి గత సంక్రాంతి సందర్భంగా జరగిన డిన్నర్ మీట్‌లో చంద్రబాబు , పవన్ ఇరు నేతలు స్థానాలు సంఖ్య, సర్దుబాటు చర్చలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. అయితే జనసేన లో వైసిపి నుండి చేరుతున్న ఆశావహుల నుంచి, కాపు సామజిక వర్గ పెద్దల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో సీట్ల సంఖ్యను మరింత పెంచాలని( 45 – 50 సీట్ల కు తగ్గితే పొత్తు ససేమిరా అంటూ..) జనసేన కోరుతోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో సీట్ల సర్దుబాటుపై అధినేతలు మరోసారి చర్చించుకొన్నారు. మరో 2 రోజులలో ఫైనల్ లిస్ట్ బయటకు విడుదల చెయ్యాలని నిర్ణయించుకోనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *