సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రముఖ సీనియర్ నటుడు, ఒకనాటి అందాల హీరో శరత్ బాబు (71) ఆరోగ్యం అత్యంత విషమం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యంతో బెంగుళూరు లో చికిత్స పొందిన అనంతరం కోలుకున్న శరత్ బాబు తిరిగి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడం తో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శరత్ బాబు కు వెంటిలేటర్ ఫై చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ ప్రకటించారు,
