సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం, జనుపల్లిలో పర్యటించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది మంది మహిళలు హర్షద్వానాలు మధ్య నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బు ను జమా చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోజమ చేసారు. దీనితో వైఎస్సా ర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. ఈ సందర్భముగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మన ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశాం, కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వం లో అక్క చెల్లెమ్మ లను మోసం చేశారు. బాబు హయాం లో 14వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. వడ్డీ మాఫీ చేయకుం డా చం ద్రబాబు మోసం చేశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం,2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్ధు చేశారు, గతంలో మహిళలు జన్మ భూమికమిటీల చుట్టూ తిరిగే వాళ్ళు . కానీ, ఇప్పుడు నేను ఒక్క బటన్ నొక్కడం తో నేరుగా మా ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నా యి. అని వివరించి పొదుపు సంఘాల మహిళలతో సీఎం జగన్ ఫొటోలు దిగారు.
