సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ నటులు, సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గత,ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్ప త్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వరుసగా మొదట సోదరుడు తరువాత కొన్నాళ్ల విరామం తో పెద్ద కొడుకు రమేష్ బాబు ను, భార్యలు విజయ నిర్మల, ఇందిరాదేవిలను వరుసగా కోల్పోయి మానసిక బాధ తట్టుకొని నిలబడుతున్న 80 ఏళ్ళ పెద్ద వయ్యస్సులో ఘటమనేని కృష్ణ కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన అస్వ స్థతకు గురి కావడంతో తెలుగు రాష్ట్రాలలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవాలయాలలో పూజలు ప్రారంభించారు.
