సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన మూలా పురుషుడు.. సాహసాల దిట్ట, 350 సినిమాల ఏకైక సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ.. తన సంస్థల ద్వారా ఎన్నో వేలమందికి ఉపాధికల్పించి..తెలుగు చిత్రసీమ ఉన్నంత వరకు ప్రజల్లో తనకు ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మంచి మనిషి, రాజకీయాలలో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ను సైతం ఎదిరించి ఏటికి ఎదురుఈది ఏలూరు ఎంపీగా గెలిచిన మొండి మనిషి .. అయన ప్రత్యర్డులు విరోధులు సైతం మెచ్చుకొనే అజాత శత్రువు హీరో కృష్ణ. రియల్ హీరోకి కొత్త నిర్వచనం తెలిపారు కాబట్టే ఆయన పేరు ముందు హీరో.. కృష్ణ అనే పదం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన మనకు దూరమై అప్పుడే ఏడాది కాలం పూర్తీ అయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మహేష్ బాబు ఏర్పాటు చేసిన కృష్ణ ప్రధమ వర్ధంతి సభకు సినీ ప్రముఖులతో పాటు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ రఘురామా కృష్ణంరాజు హాజర్యయారు. ఈ నేపథ్యంలో భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ అభిమాని, వైసిపి నేత, రాయప్రోలు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో స్థానిక వీరమ్మ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధమ వర్ధంతి లో ఆయనకు ఘన నివాళ్లు అర్పించి 500 వందల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బి హెచ్ సుబ్బరాజు, గంట ప్రసాద్ తదితర సీనియర్ కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
