సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నిత్యా అన్న సమారాధన దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులు ప్రశంసలు అందుకొంటున్న నేపథ్యంలో నేడు, ఆదివారం జరిగిన అన్నసమారాధన నిర్వహణలో స్థానిక ఎమెల్య కుమారుడు, రాష్ట్ర వైసీపీ యువత నాయకులు గ్రంధి రవితేజ పాల్గొని నిర్వాహక కమిటీ సభ్యులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ..అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని.. నిత్యాన్నదాన సమారాధనతో పాటు గత 23 సంవత్సరాలుగా భక్తులకు కార్తీమాసం సందర్భంగా దాతల సహకారంతో భక్తులకు షడ్రుచులతో అన్నదానాన్ని చేస్తున్న కమిటీని ఆయన అభినందించారు. కార్తీక మాసం నెలరోజులపాటు ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించేందుకు తమ గ్రంధి కుటుంబం కూడా 100 క్వింటాళ్ల బియ్యాన్ని శ్రీ అన్నపూర్ణ అమ్మవారి మొక్కుబడి లో‌ భాగంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా కార్తీకమాసంలో శని, ఆది, సోమ వారాలలో రాష్ట్రం నలుమూలల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుందని అన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *