సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 చివరి అంకం లో ప్రవేశిస్తుంది. వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. అలా గత శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నా డు. అయితే ఎప్పటిలానే వీక్షకులు భరించలేని లొసుగు రాజకీయాలు చేసే ‘చుక్క టీమ్’ ఫై తన ఆప్యాయత ప్రకటించారు. ముందుగా శోభ ని కన్ఫెషన్ రూం లోకి పిలిచాడు, హౌస్ వాతావరణం కూడా నీ చేష్టలతో కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. ఎందుకో బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకుల తీర్పు కు విరుద్ధంగా శోభను కొనసాగిస్తూ వచ్చిన .. నాగార్జున శోభను కాస్త మందలించిన మరల ఆమెకు మాటలతో వెన్న రాసేశారు. ఇక నాగార్జున కు మంచి అటాక్ శివాజీ రూపంలో వచ్చింది. హోస్ట్ గా నాగ్ తన గొప్పతనం చాటుకోవాలని , శోభకు ప్రియాంక కు ‘మంచి మాటకారి”శివాజీ నోటితో క్షమాపణలు చెప్పించాలని చేసిన ప్రయత్నాలు ఆయన హోస్ట్ స్థాయి ని దిగజార్చాయని చెప్పవచ్చు.. సినిమాలలో ఎన్నో బూతు డైలాగ్స్ వేసేసిన నాగార్జున,.. హోస్ట్ గా మాత్రం కోట్లాది మహిళల పక్షపాతి గా బిల్డుప్ ఇస్తూ అయన వేసే తింగర ప్రశ్నలకు దీటుగా శివాజీ ఏమాత్రం బెరుకు లేకుండా బాబు గారు.. బాబుగారు అంటూనే బాంబులు లాంటి సమాధానాలు చెప్పడటం తో నాగార్జున పూర్తిగా తడబడి పోయి అనవసరంగా ఇరుక్కున్న భావము స్వష్టం గా కనపడిపోయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో రైతు బిడ్డ‘ ప్రశాంత్, శివాజీలను టార్గెట్ గా ప్రశ్నించే నాగార్జున మాటల దిగజారుడు తనం ట్రోల్స్ రూపంలో వైరల్ అవుతుంది. మహిళలు కూడా విమర్శిస్తున్నారు. నేను తప్పు మాట్లాడలేదు.. అయితే శోభ , ప్రియాంకల విషయం లో నేను తప్పు చేసానని మీరు భావిస్తున్నారు కాబట్టి మీకు క్షమాపణలు చెబుతాను అని చెప్పటంతో నాగార్జునకు దిమ్మ తిరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి ముక్కు మూసుకుని నన్ను యోగ చేసుకోవడానికి పంపించారా? నేను మనిషిని బాబుగారు.. అంటూ తూటాలాంటి శివాజీ చెప్పడంతో నాగార్జున మాటలు తడబడ్డాయి. మొత్తానికి ఇన్ని సీజన్ల బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఇంతటి పరాభవం ఎప్పుడు చూడలేదని చెప్పాలి .మొత్తానికి బిగ్ బాస్ రేటింగ్ మాత్రం ఈ ఎపిసోడ్ తో మరింత దూసుకొనిపోతుంది. నేటి ఆదివారం శోభ ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తుంది..?
