సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పురాణ ప్రాశస్యం ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములలో భాగంగా నేడు, 14 రోజు సోమవారం కావడం అందులోను పౌర్ణమి కావడం ఇక్కడ శివలింగం ‘సాక్షాత్ చంద్ర ప్రతిష్ట’గా పురాణాలూ పేర్కొనడంతో ఎంతో దూరప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రావడంతో వేలాది భక్తులు, వందలాది వాహనాలతో ఆలయ పరిసరాలు కార్తీక దీపారాధనతో శివోహం అయ్యాయి. నేటి తెల్లవారు జాము 3గంటల నుండి భక్తులు శివదర్శనం కోసం భారీ క్యూ లైన్లలో వేచిఉన్నారు. నేటి సాయంత్రం స్వామివారి దివ్య అలంకారం ఫై చిత్రంలో చూడవచ్చు.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్స్ విక్రయం ద్వారా 6,13,750/లు, ఇతర పూజా రుసుముల ద్వారా రూ.20,200/లు మొత్తం రూ.6,33,950/-లు ఆధాయం రాగా, 3006లడ్డులు ప్రసాదం గా విక్రయించినట్లు ఆలయ ఇఓ, డి రామకృష్ణ రాజు ప్రకటించారు.
