సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్ ఫై విదేశీ మదుపర్లు పెట్టుబడుల సానుకూలత నేపథ్యంలో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా లాభాలలో పరుగులు పెడుతున్నాయి. దీంతో సూచీలు ఇటీవలి నష్టాల నుంచి క్రమంగా కోలుకున్నాయి. నేడు బుధవారం కూడా స్టాక్‌మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో గట్టెక్కయి . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం అటు విదేశీ, ఇటు స్వదేశీ మదుపర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాపడ్డాయి. నేటి ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఓ దశలో 350 పాయింట్లకు పైగా లాభపడి 82, 783 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. బుధవారం సెన్సెక్స్ 82, 308-82,783 శ్రేణి మధ్యలో ఉగిసలాడింది. చివరకు సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 82, 515 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే చివరకు 37 పాయింట్ల లాభంతో 25, 141 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం వరుసగా రెండో రోజు కూడా నష్టపోవడం జరిగింది.
