సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కొంత లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్ నేడు, గురువారం అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా మన దేశ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గత బుధవారం ముగింపు (81, 526)తో పోల్చుకుంటే దాదాపు 50 పాయింట్ల నష్టంతో గురువారం ఉదయం మొదలైన సెన్సెక్స్ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర హెచ్చు తగ్గులు జరిగాయి. లాభనష్టాలతో దోబూచులాడాయి. ఐటీ రంగం మినహా మిగిలిన రంగాలపై మదపుర్లు దృష్టి సారించలేదు. దీంతో దేశీయ సూచీలకు నష్టాలు తప్పలేదు.అయితే మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుని ఒక దశలో 81, 211 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 236 పాయింట్ల నష్టంతో 81, 289 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 93 పాయింట్ల నష్టంతో 24, 548 వద్ధ స్థిరపడింది. 24, 550కు దిగువన రోజును ముగించింది.సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, మ్యాక్స్ హెల్త్‌కేర్, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.86కు చేరుకొంది.
