సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సినీనటి పూనమ్ కౌర్ గురించి తెలియనివారు ఉండరు . ఆమె నటిగా పెద్ద సూపర్ హిట్ సినిమాలు నటించకపోయిన ఆమె వాయిస్ సైతం .. న్యూస్ ఛానెల్స్ లోను ,సోషల్ మీడియా లో మంచి పాపులర్ హాట్ టాపిక్. అయితే తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. గురుపూర్ణిమ సందర్భంగా ఇలా షేర్ చేశారు. ‘మీ అం దరినీ రిక్వె స్ట్ చేస్తున్నా ను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని.. స్టేజ్ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వాడు ‘గురువు’ కాదు, మీకు దారి చూపించేవారు ‘గురువు’అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు , మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు .’ అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి రాశారు..? తెలుగు సినీ పరిశ్రమలో గురువు’ అని ఎవరిని అంటారు?ఆయన సినిమాలలోనూ, స్టేజీలమీద ఏమి నీతులు చెబుతాడు? అతని వల్ల ,అతని మిత్రునివల్ల పూనమ్ పడ్డ బాధలేమిటి? అని మీడియాలో ఇప్పటికే రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.
