సిగ్మాసితెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం కాస్త అటుఇటుగా ఉన్న భారతీయ దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు సోమవారం (ఫిబ్రవరి 24న) భారీ నష్టాలతో కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా ఐదో ట్రేడింగ్ రోజు కూడా స్టాక్ మార్కెట్‌లో భారీగా క్షీణత నమోదైంది. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 856.65 పాయింట్లు పడిపోయి 74,454.41 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు తగ్గి 22,553.35 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్లు పడిపోయి 48,651 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 473 పాయింట్లు పడిపోయింది. . ఈ క్రమంలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 4.38 లక్షల కోట్లు కోల్పోయారు.ఇండెక్స్ నిఫ్టీ గత ఐదు నెలలుగా వరుసగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో 1996 తర్వాత ఇదే అతిభారీ క్షీణత అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
