సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగాతెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానులు ఆయన కు ఘననివాళ్ళు అర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద నందమూరి బాలకృష్ణ , రామకృష్ణ, నందమూరి సుహాసిని, మరియు నేటి తెల్లవారు జామున వచ్చి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని , నాన్నగారు పేదల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చింది. టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద ప్రజలకు ఆసక్తి ఉండేది కాదు. ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. ఎన్టీఆర్‌కు ముందు.. ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలనే ప్రస్తుతం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమలు చేస్తున్నాయి. మద్రాసు నగరానికి మంచి నీళ్ళిచ్చిన మహానభావుడు ఎన్టీఆర్’’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.
