సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు ప్రథమ వర్ధంతి ని భీమవరం పరిసర ప్రాంతాలలో వృద్ధులకు, వికలాంగులకు, అనాధలకు, పలు సేవా కార్యక్రమాలు అందిస్తూ నిర్వహించారు. జివిఆర్ కుమారులైన స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, బాలాజీ, చల్లారావులు సంప్రదాయ పద్ధతిలో తండ్రి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. జివిఆర్ సతీమణి వెంకటరత్నం , కుటుంబ ఇతర కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,కల్వకొలను తులసి రావు, లు జివిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పాతపాటి సర్రాజు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్థసారథి లు మాట్లాడుతూ గ్రంధి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ గా పట్టణానికి అనేక సేవలు అందించారని అన్నారు. ముఖ్యంగా రాజకీయాలలో ముక్కు సూటిగా వ్యవహరించి ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లుగా మొఖం మీద మాట్లాడే వారని వెల్లడించారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్లి అండగా నిలిచేవారని, పట్టణ ప్రజల గుండెల్లో జివిఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాసరావు, గన్నా బత్తుల శ్రీనివాసరావు, కల్వకొలను తులసి రావు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జివిఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. గ్రంధి సోదరుల నేతృత్వంలో పట్టణంలోని కుష్ఠు వ్యాధి కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, అరుణోదయ మనో వికాస కేంద్రం, 50 మంది వికలాంగులకు, పట్టణంలోని 6 వృద్ద ఆశ్రమాలు చిన అమిరం తబితా, జడ్డు బ్రహ్మజి వృద్ద ఆశ్రమం, మహాదేవ పట్నం సుగుణ వృద్ద ఆశ్రమం, అరుణోదయ మనో వికాస కేంద్రం, ఇమ్మనేయులు అనాధ ఆశ్రమంలో సుమారు 350 మందికి రగ్గులు, స్టీల్ చెంబులు, భోజన సదుపాయాలు కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *