సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పేద ప్రజలను ఆదుకొనే అభయప్రదాతగా దేశంలోనే ప్రఖ్యాత యూట్యూబర్ గా ఎదిగిన తెలుగు యువకుడు హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు తాజగా, నేడు, ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సజ్జనర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. చాల కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల మాయలో పడి సర్వస్వం పోగొట్టుకొని ప్రాణాలు వదులుతున్న అభాగ్యులు, యువకులు కుటుంబాలను రోజు వార్తలలో చూస్తూనే ఉన్నాం. వీటిపై చాల కాలంగా ప్రఖ్యాత ట్రావెలింగ్ యూ ట్యూబర్ ‘ నా అన్వేషణ’ అన్వేష్ కూడా ఎన్నో సార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న, చేసిన వారికి చుక్కలు చూపిస్తున్న ఒకనాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ , ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కన్ను బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్న యూ ట్యూబర్స్ మీద పడింది. నిన్న ట్విటర్ వేదికగా హర్ష సాయిపై మండి పడ్డారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి మాట్లాడిన మాటల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘ చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
