సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్ లో ఇప్పటికి ప్రదర్శితమౌతూ ఇప్పటికే 70 కోట్ల రూపాయలు సాధించిన తోలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి అవార్డులు సాధించి అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ‘ఆస్కార్‌’కి అడుగు దూరంలోఉంది. ఇప్పుడు 6వ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ నుంచి ఒకేవేదికపై ఐదు విబాగాల్లో అవార్డులు అందుకొంది. తాజాగా గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ అవార్డు వేడుకల్లో బెస్ట్‌ యాక్షన్‌, బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ సాంగ్‌తోపాటు స్పాట్‌ లైట్‌ అవార్డును కూడా అందుకున్నారు రాజమౌళి అండ్‌ టీమ్‌. రాజమౌళి, రామ్‌చరణ్‌ తదితరులు ఈ వేడుకలో భాగమయ్యారు. ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ కేటగీరీలో ఏరియల్‌ కంబాట్‌ ఫిల్మ్‌ ‘టాప్‌ గన్‌: మేవరిక్‌’, ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘బ్యాట్‌ మ్యాన్‌’, ఉన్నప్పటికీ ఆ సినిమాలను పక్కకు నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌’ అవార్డు సొంతం చేసుకుంది. ‘భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. ఏ సినిమా కథ అయినా మాకున్న పురాణ, ఇతిహాసాల నుంచే పుట్టాలి. నా కథలకు స్ఫూర్తి మా పురాణాలే. మేరా భారత్‌ మహాన్‌’’ అని ఆ వేదికపై ప్రకటించారు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *