సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ దేశం లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై భీకర వైమానిక దాడులు కొనసాగుతూనే ఉంది. గత . సెప్టెంబర్ 27న హిజ్బుల్లా గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను చంపేసింది. భూగర్భ కార్యాలయంలో ఉన్న ఆయన ను చంపడానికి ఇజ్రాయెల్ సైన్యం 80 టన్నుల బాంబుతో దాడి చేసింది. గత వారంలో వైమానిక దాడుల్లో 7 మంది కీలక కమాండర్లను హతమార్చింది. టెర్రర్ గ్రూప్ సెంట్రల్ కౌన్సిల్‌లోని సీనియర్ సభ్యుడు నబిల్ కౌక్‌ను కూడా చంపేశారు. భీకర దాడులు కొనసాగుతున్నప్పటికీ హిజ్బుల్లా దళాలు ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. గత రెండు వారాలుగా లెబనాన్‌లో ఐడీఎఫ్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య మొత్తంగా వెయ్యి దాటినట్లు భావిస్తున్నారు. .నిన్న హిజ్బుల్లాలు జరిపిన మిసైల్ దాడిలో ఇజ్రాయిల్ లోని పలు భవనాలు దెబ్బ తినడం కొందరు ప్రజలు మరణించడం జరిగింది. దేనితో ఇజ్రాయిల్ మరింత ప్రతీకారంతో లెబనాన్ ఫై జరిపిన తాజా దాడిలో 100 మందికి పైగా మరణించారు.350 మందికి పైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ దాడులు నేపథ్యంలో ఇరాన్ లెబనాన్ కు మద్దతుగా యుద్ధరంగంలోకి దిగితే ఇజ్రాయిల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా పశ్చిమాసియా లో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ప్రశాంతత కరువయింది.
