సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యూఎస్ డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి ప్రపంచ ఆర్థిక సంకేతాల నేపథ్యంలో బంగారం ఫై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరో ప్రక్క మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో అనేక మంది ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు తగ్గించారు. దీంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లోఈ వారం రోజులలో బంగారం ధరలు దాదాపు రూ. 6,000 పతనం కావడం విశేషం. ఇది దేశంలో మహిళలకు సంతోషం కలిగించే వార్తే అయితే గోల్డ్ ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నేటి, సోమవారం ఉదయం బంగారం ధరలు మరింత స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 బంగారం గ్రాముల ధర 60 రూపాయలు తగ్గిపోయి రూ. 75,740కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 69,440కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 75,590కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,280కి చేరింది.
