సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ పశ్చిమ, ఈస్ట్ కోస్ట్ రైల్వే లోని ఖుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వ ర్–మంచేశ్వర్, సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మా ణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను రేపటి సోమవారం నుండి అంటే ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసారు. దీనిలో భాగంగా కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడం తోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారు. గోదావరి జిల్లాలలకు సంబంధించి కీలక రైళ్ల వివరాలు: కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్ ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం –రాజమండ్రి (07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం –విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్డబుల్ డెక్క ర్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం (17240/17239) సింహాద్రి ఎక్స్ ప్రెస్లను రెండు వైపులా రద్దు చేసారు.. కాగా, భీమవరం మీదుగా వెళ్లే నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లోవిజయవాడ, గుడివాడ, భీమవరం , నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
