సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 16వ తేదీన జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరేది లేనిది తేలిపోతుంది. అని సంకేతాలు వస్తున్నా ఈ నేపథ్యంలో .. ఇప్పటి వరకు చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ కు అమిత్ షా బీజేపీ కూటమిలో ఉండాలంటే విధించిన షరతు ప్రచారంలో ఉంది. దీనిని ఏ పార్టీ ఖండించక పోవడం విశేషం.. షరతు ఏమిటంటే.. .. ప్రతి జిల్లాలో ఉండే 7 నియోజకవర్గాలలో టీడీపీకి 4,జనసేనకు 2, బీజేపీ కి 1 చప్పున కేటాయించాలని సింపుల్ గా చెప్పినట్లు ఈ తీరున అయితే రాష్ట్రంలో 100 సీట్లు టీడీపీ కి 50 సీట్లు జనసేనకు , 25 సీట్లు బీజేపీ కి వస్తాయి. ఇక లోక్ సభ స్థానాలు మొత్తం 25 లో 15 సీట్లు టీడీపీకి బీజేపీ జనసేన కు కలపి 10 వస్తాయి. వాటిలో 7 స్తనాలు బీజేపీ పోటీ చేస్తుంది. అంటూ విధించిన షరతులు జనసేన నెత్తిన పాలు పోస్తే.. టీడీపీ పార్టీని మాత్రం సంక్షోభం లోకి నెడుతుంది అని భావించవచ్చు. కూటమి అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలో కూడా ఇదే నిష్పత్తి లో జనసేన, బీజేపీలకు కూడా భాగం ఇవ్వాలనే షరతు అమిత్‌షా విధించినట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఇటుగా సర్వే లలో అధికార వైసీపీ కి టీడీపీ జనసేన కూటమి హోరాహోరీగా పోటీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం 100 సీట్లలో మాత్రమే టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీలో అసంతృప్తి పర్వము ను ఎగసిపడుతుంది. అది వైసిపి మరోసారి అధికారంలోకి రావడానికి రాచబాట వెయ్యవచ్చు.. లేదా కాలం కలసి వచ్చి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే.. టీడీపీ కి స్వంతంగా ఎమ్మెల్యేల సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కు తక్కువగా ఉంటుంది కాబ్బటి .. అటువైపు ఎక్కువ సీట్లలో గెలచి అతి పెద్ద పార్టీగా వైసిపి పార్టీ అవతరిస్తే ఎప్పటికైనా అధికారం లెక్క తప్పుతుంది. జనసేన, బీజేపీ లకు బయట నుండి వైసీపీ మద్దతు ఇస్తే.. టీడీపీ ఖేల్ ఖతం అవుతుంది. అమిత్ షా వేసినట్లు భావిస్తున్న ఈ తెలివైన పాచిక ను టీడీపీ ఆమోదిస్తే ఏపీలో అధికారాన్ని సీట్ల తో సంబంధం లేకుండా బీజేపీ మాత్రమే శాసిస్తుంది.. ఏది జరిగిన జనసేన’కు లాభమే తప్ప నష్టం ఉండదు.. .. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *