సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ నేడు, బుధవారం శంకుస్థాపన చేశారు. 13 ఫుడ్ యూనిట్స్ కు సంబంధించి ప్రారంభోత్సవం, శంఖుస్ధాపనలు, ఎంవోయూలు చేస్తున్నామని సీఎం తెలిపారు.ఇటీవల విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌ర్ సమిట్‌లో భాగంగా 386 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయని.. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దసరా నుండి వైజాగ్ లోనే ఉంటాను కాబ్బటి అక్కడినుండి ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి అభివృద్ధి ఫలాలు కార్యరూపం దాల్చేలా వేగంగా ఫాలోఅప్ చేస్తామని చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కమిటీని దాని కోసం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో ఈరోజు మూడు ప్రారంభోత్సవాలతో పాటు 9 శంఖుస్ధాపనలు 1 ఎంవోయూ చేస్తున్నామని అన్నారు. రూ.3058 కోట్లు పెట్టుబడితో 6755 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమం ఇది అని చెప్పారు. 14 జిల్లాల్లో వస్తున్న అన్ని పరిశ్రమల వల్ల 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
