సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ ఎంపీ జీవీఎల్ నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పరిస్థితి బాగోలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందరికి తెలుసునని, సీఎం జగన్ పాలనా విధానాలలో అన్నిరకాలుగా విఫలం అవుతున్నారని, దీనికి ప్రతామ్నాయం ఒక్క బీజేపీ మాత్రమేనని ప్రజలు గమనిస్తున్నారని, తాము జనసేనలో కలసి ముందుకు వెళతామని, అంతే కానీ ఇటీవల చంద్రబాబు చేస్తున్న ప్రచారం లో నిజం లేదన్నారు. టీడీపీ మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశమే లేదన్నారు. చం ద్రబాబు తన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తనకు తానుగా ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తీ చేశారో ? చెప్పాలన్నారు. అసలు చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్య మైందన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననడం హాస్యాస్పదమన్నా రు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
