సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’.. రేపు విడుదల అవుతున్న టీజర్ కు పవన్ కల్యాణ్ ఇంకా డబ్బింగ్ చెప్పలేదనే వార్తతో.. అందరిలోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. ఆ కన్ఫ్యూజన్‌ని తొలగిస్తూ.. వారాహి యాత్రలో భీమవరంలో ఉన్న పవన్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. దర్శకుడు సముద్ర ఖని రావడం తో (ఫై తాజా చిత్రంలో ) ఈ రోజు బుధవారం బ్రో టీజర్ కు డబ్బింగ్ పూర్తి చేయడం విశేషం. తాజగా బ్రో కి డబ్బింగ్ చెప్పేసి.. ‘బ్రో’ టీజర్ విడుదలకు పవన్ కల్యాణ్ లైన్ క్లియర్ చేశారు.‘బ్రో’ టీజర్‌ని రేపు గురువారం (జూన్ 29) సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి భీమవరం బ్రాండ్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం మరో విశేషం.
