సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నవరం తో భీమవరం వరకు వారాహి యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమవరంలో ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎన్నికలలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అని.. దీనిని పవన్ కూడా విశ్వసిస్తున్నట్లు ఉన్నారు. అందుకే గత 2019 ఎన్నికలలో ఇక్కడి నుండే పోటీ చేసి భంగపడినప్పటికీ భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి 2024 ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు చాల స్వష్టంగా ఉన్నాయి. ఇదే విషయం అన్ని అనుకూలిస్తే రేపు శుక్రవారం భీమవరం లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల అభివృద్ధికి జనసేన పార్టీ వేసిన ‘మాస్టర్ ప్లాన్’ రేపు భీమవరం లోనే ప్రకటిస్తానని పవన్ అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. వైసిపి ఫై ఒంటరిగా పోరులో దిగితే వీర మరణమే..ఈసారి ఆ తప్పు చెయ్యను అని ప్రకటించిన పవన్, ప్రస్తుతం బీజేపీ తో పొత్తు ఉన్నపటికీ టీడీపీ తో పొత్తు విషయం కొంత డైలమో లో ఉంది. అయితే తాము కోరుకున్నని సీట్లు(45..?) టీడీపీ ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో అవసరమైతే కొన్ని లోపాయికారి ఒప్పందాలతో ముందుకు వెళ్లే అవకాశం కనపడుతుంది. అందుకే పవన్ ప్యూహం మారింది. ఒక ప్రక్క సినిమాలు చేసుకొంటూ.. రాష్ట్రము మొత్తం మీద ఫోకస్ చేసి పార్టీ ఖర్చులు, శ్రమ పెంచుకొని భంగ పడేకంటే .. జనసేన పార్టీ టీడీపీ కంటే వైసిపి కి గట్టిగ పోటీ ఇవ్వగల కొన్ని నియోజక వర్గాలతో పాటు కీలకమైన గోదావరి జిల్లాలోని 34 సీట్ల ఫై గట్టిగ ఫోకస్ పెడితే చాలు అని ప్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. ఒక వేళ రాష్ట్రంలో హంగ్ వస్తే.. జనసేన పాత్ర కీలకం అని, లేకపోయిన పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మారవచ్చు..? వైసిపి ని గోదావరి జిల్లాలలో ఎక్కడ గెలవనివ్వకూడదు అంటూ పదే పదే తన స్లోగన్ గా మార్చుకొన్నారు జనసేన అధినేత.. గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టాలంటే మరల జిల్లా కేంద్రం, మరియు గోదావరి జిల్లాలలో సామాజికంగా, ఆర్ధికంగా బలమైన ప్రాంతం భీమవరమే ప్లాట్ ఫారం గా చేసుకొని జనసేన పావులు కదపాలని జనసేనాని ఆలోచనగా విశ్లేషించవచ్చు.. గతంలో తాను ఓటమి చెందిన కూడా తరువాత భీమవరం నియోజకవర్గంలోని పలు ఎంపీటీసీ లతో పాటు ఉన్న
2 మండలాల్లో వీరవాసరం జడ్పీటిసి ని జనసేన గెలుచుకొందని, ఇప్పడు స్థానిక రాజకీయ పరిస్థితులు ఇంకా మారాయని ఇంకాస్త కష్ట పడితే భీమవరంతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలలో జనసేన సత్తా నిరూపించుకోవచ్చునని పవన్ భావిస్తున్నారు...సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
