సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: హోటల్స్ లోను ఇతరత్రా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే 19కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నేడు, మంగళవారం ( ఆగస్టు 1న) చమురు కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. సిలిండర్‌పై రూ.99.75 మేర తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ధరలు నేటి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. సవరించిన ధరల ప్రకారం.. ప్రస్తుతం 19కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,028, కోల్‌కతాలో రూ.2,132, చెన్నైలో రూ. 2,192, విశాఖపట్టణంలో రూ 1,750.50, హైదరాబాద్ లో రూ. 1918 గా ఉన్నాయి. అయితే మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో తక్కువ ధరకు సిలిండర్ ధర ఉండటం గమనించవచ్చు.. ఇక ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు హైదరాబాద్ లో రూ 1,155, విశాఖపట్టణంలో రూ. 1,112, గా ఉన్నాయి. అయితే గృహవినియోగ వంట గ్యాస్‌పై ఎలాంటి తగ్గింపు లేకపోవడం సామాన్య కుటుంబాలకు నిరాశ కలిగించింది. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళా తప్పని సరిగా పెంచేసిన అన్ని ధరలు కాస్త తగ్గుతాయని ఆశ అయితే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *