సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భీమవరం మీదుగా శబరిమల అయ్యప్ప కొండకు వెళ్లే భక్త అయ్యప్పల కోసం ఈ నవంబరు, డిసెంబర్‌, జనవరి నెలల్లో కొట్టాయంకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. నరసాపురం నుంచి 07135 నెంబరుతో ఈ నవంబర్ నెల 26, డిసెంబరు 10, 17, 24, 31, జనవరిలో 7, 14 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయం చేరుకొంటుంది. మరల తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి 07136 నెంబరుతో నవంబరు 27, డిసెంబరు 11, 18, 25, జనవరిలో 1, 8, 15 తేదీల్లో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మర్నాడు రాత్రి 8న్నర గంటలకు భీమవరం తదుపరి తొమ్మిది గంటలకు నరసాపురం చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, చిత్తూరు, జాలర్‌పేట, తిరుపుర్‌, కోయంబత్తూర్‌, ఎర్నాకులం మీదుగా పాలకొల్లు, భీమవరం టౌన్‌, జంక్షన్‌, ఆకివీడు, కైకలూరు స్టేషన్లలో ఆగుతుంది అని అయ్యప్పలు గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *