సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదటి విడుత ఇటీవల భీమవరం ముగిసిన నేపథ్యంలో 2వ విడుత వారాహి యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 9వ తేదీన ఏలూరులో ప్రారంభమౌతుంది. ఆ రోజు సాయంత్రం 5గంటలకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. తదుపరి, వరుసగా దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, తణుకు, నిడదవోలు, పాలకొల్లు లలో వారాహియాత్రలు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనేలా మధ్య మధ్య 2లేదా 3 రోజుల విరామాలతో షెడ్యూలు తయారు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ భీమవరం లో మరోసారి భీమవరం, ఉండి జనసేన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *