సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఏ ముహూర్తాన షూటింగ్ మొదలు పెట్టారో కానీ.. 3 ఏళ్ళు అవుతున్న సినిమా ఒక కొలిక్కి రాలేదు. అయితే ఈ ఎన్నికల ముగింట.. తాజగా నేడు, గురువారం విడుదలైన దీని టీజర్ పవన్ అభిమానులలో కొత్త ఉత్సహం తెచ్చింది. కష్టాలలో ఉన్న పేదలను ఆదుకొని వారి కోసం పోరాడే యోధుడిగా పవన్ కల్యాణ్ కనపడ్డారు. ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రం మిగిలిన షూటింగ్ ను నిర్మాత ఏ ఎం రత్నం పెద్ద కుమారుడు సినీ దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన కొన్ని పోస్టర్లపై క్రిష్ జాగర్లమూడి పేరు లేకపోవడం తో ఈ సినిమా నుండి క్రిష్ వైదొలిగారా? అనే కామెంట్స్ మొదలయ్యాయి. తాజాగా వారందరి అంచనాలు దీనితో నిజం అయ్యాయి. గతంలో ఏ ఎం రత్నం నిర్మించిన ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా జ్యోతి కృష్ణ పనిచేసిన అనుభవం ఉంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు.నిధి అగర్వా ల్ కథానాయిక. ఈ ఏడాది చివర్లో ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకోని వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *