సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పులివెందులలో పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్ నేడు, శనివారం టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని జగన్ పరామర్శించారు. తదుపరి ఆయన మీడియా తో మాట్లాడుతూ.. వైసీపీ కి మద్దతు ఇచ్చాడని 20ఏళ్ళ పిల్లాడు అజయ్‌ను టీడీపీ వారు నిర్ధాక్షణ్యంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి దాడి చేసి ఆసుపత్రి పాలు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తర్వాత అంతా కలిసి ఉండే పరిస్థితి ఉంటుందని.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ సంప్రదాయానికి తిలోదకాలు పలికి చెడు సాంప్రదాయానికి తెరలేపారన్నారు. ఇదే పరిస్థితి చంద్రబాబు అధికారంలోనుంచి దిగిపోయాక టీడీపీ కార్యకర్తలకు వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎన్నడూలేదని.. తమరు వేసే బీజం చెడు సాంప్రదాయమంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమి పేద ప్రజలకు ఇచ్చిన పధకాలు ఏవి అమలు చెయ్యడం లేదని కానీ వైసీపీ నేతలపై దాడులు చేసి టీడీపీ నేతలు రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృస్టించాలని చూస్తున్నారని.. ఇప్పటికైనా చంద్రబాబు ఆపాలని హితవుపలికారు. బాబు మోసపురిత వాగ్దానాలు నమ్మి ఓట్లేశారన్నారు. రుణ మాఫీ అన్నారని… మహిళకు నగదు అన్నారని..అమ్మవడి ఇంట్లో అందరి పిల్లలకు . రైతులకు రైతు భరోసా పెంచి ఇస్తామని చెప్పారుగా.. అవి చూసుకోవాలని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికి ఇంటికి ఉద్యోగం అన్నారు అది చేయాలన్నారు. ఇంత వరకు స్కూల్ పిల్లలకు బాగ్స్ కిట్స్ అందించలేదని విమర్శించారు. అతిసారతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపానపపోలేదని జగన్ విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *