సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద టిప్పర్ను కారు అతి వేగంతో ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కడప జిల్లాకు చెందిన అంజినాయక్ (29), షేక్ అలీమ్ (32), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్ (30)గా గుర్తించారు.కాగా, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బస్సు అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సత్యసాయి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
