సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపాలిటీ పరిధిలో కేంద్ర సహకారంతో ‘అమృత 1-0 పేజ్ 2 లో భాగంగా పట్టణ ప్రజలకు అదనంగా రోజుకు శుద్ధి చేసిన 1కోటి 75 లక్షల మంచి నీరు ఫిల్టర్ చేసి అందించే సామర్ధ్యం ఉన్న నూతన ప్లాంట్ ను ప్రభుత్వ విఫ్ స్థానిక ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన భీమవరం పట్టణంలో అబివృద్ధి శరవేగంగా జరుగుతుందని అలాగే ఉపాధి కోసం, చదువు కోసం వచ్చే వారి వల్ల జనాభా కూడా పెరిగిపోతుందని భవిషత్తు లో ప్రజలు కు మంచినీటి అవసరాలు తీరాలంటే ప్రస్తుతం మున్సిపాలిటీ రోజు శుద్ధి చేసి వదులుతున్న సుమారు 1 కోటి లీటర్లు నీరు సరిపోవడం లేదని అందుకే అదనంగా మరో 1 కోటి 75 లక్షల లీటర్లు నీరు శుద్ధిచేసే విడుదల చేసే ప్లాంట్ ను అమృత పేజ్ 2 నిధులతో ఏర్పాటు చేసుకొని ఈ రోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈనెల 20 వ తేదీ తరువాత భీమవరం తాడేరు రోడ్డులో నిర్మిస్తున్న టీడీకో పేదల ఇళ్లలో 3500 ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందని , నిజానికి వాటిలో 1000 ఇల్లు అన్ని హంగులతో సిద్ధంగా ఉన్నాయని మరో 2500 ఇళ్లు స్వల్ప నిర్మాణాలు చెయ్యవలసి ఉందని వచ్చే ఫిబ్రవరి లో ఎన్నికల కోడ్ వస్తే ఇబ్బంది లేకుండా ఒకేసారి 3వేళా ఇళ్లు పైగా పేదలకు పంపిణి చెయ్యాలని నిర్ణయించామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ( ఫై చిత్రంలో ప్లాంట్ ప్రారంభం చూడవచ్చు..) ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైసిపి నేతలు గూడూరి ఉమాబాల, కామన నాగేశ్వర రావు, కోడె యుగంధర్ తదితరులతో పాటు మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.
