సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా భారతీయుల ఆరాధ్య దేవుడిగా కొలుస్తారు, రేపటి సోమవారం జనవరి 22న శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమయింది. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఈనేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరంలో పలు సంస్థలు, ఆధ్యాత్మిక సేవ సంస్థలు ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అంటూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్తు తో పాటు భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం, వారి ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ళ భారీ ర్యాలీ పట్టణ వీధులు గుండా పలువులు శ్రీరామ ముద్ర తో కాషాయ జెండాలను ధరించి జై.. శ్రీ రామ్ అంటూ నినాదాలతో స్థానిక మారుతి సెంటర్ లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రధాన రహదారులమీదుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ బైకు ర్యాలీలో తమ భర్తలతో కల్సి వెనుక కూర్చుని మహిళలు విశేషంగా పాల్గొనడం విశేషం నేటి ఆదివారం సాయంత్రం నుండి స్థానిక ఆర్యవైశ్య వర్తక సంఘం ( త్యాగరాజ భవనం)భవనంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు సకుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ పుణ్య కార్యక్రమాన్ని తనివితీరా తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. రేపు సోమవారం ఉదయం పట్టణం అంతా శ్రీరామ కీర్తన ,ప్రతి ఇంటా విశిష్ట దీపారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. భీమవరం నుండి ఎందరో అయోధ్య కు తరలివెళ్లారు.
