సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ రఘురామా కృష్ణంరాజు భీమవరం శివారులోని తన నివాసంలో నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరసాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నించినా, బిజెపి నాయకత్వం అంగీకరించలేదని అయితే ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని తెలిపారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికారికంగా ఈ నెల 21వ తేదీన విజయవాడలో పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ అందజేయనున్నారని తెలిపారు. నేడు, శుక్రవారం మంచి రోజు కావడంతో ఒక సెట్ నామినేషన్ పత్రాలను పార్టీ బి పారం లేకుండా నా తరపున మా అబ్బాయి రిటర్నింగ్ అధికారికి సమర్పించారని, ( నిన్న సిగ్మా న్యూస్ లో ఉండి నుండి రఘురామా పోటీకి నామినేషన్ వేస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చాము ) ఈనెల 22వ తేదీన అధికారికంగా నామినేషన్ దాఖలు చేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి నన్ను వ్యక్తిగతంగా అభిమానించే ప్రతి ఒక్కరు, తెదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు రానున్న ఎన్నికల్లో నేను రామరాజు, శివరామరాజుల సంపూర్ణ సహకారంతో గెలవబోతున్నానని తెలిపారు. త్వరలోనే వారిద్దరినీ స్వయంగా కలిసి నా గెలుపుకు సహకరించాలని అభ్యర్థిస్తాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే కొట్టి వేయవచ్చునని రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేసారు.
