సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చిన అమిరంలో నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు ఈ నేపథ్యంలో జనసేన , భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. అందరు అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఆయనకు తిరుగులేదని నిరూపించుకొన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని, కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం ఆనందం గా ఉందన్నారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయనని, పవన్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం మొక్కలను నాటరు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు
