సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఊహాగానాలకు తెరపడింది. విజయసాయి బీజేపీ కోసమే తన ఎంపీ పదవి వదలకున్నాడు అన్న వాదన? నిజం చేస్తూ.. ఆ స్థానంలో ఎన్డీయే అభ్యర్థిగా భీమవరంకు చెందిన అడ్వాకెట్ మరియు సీనియర్ బీజేపీ నేత పాకా వెంకటసత్య నారాయణను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ గా కీలక పదవిలో ఉన్నారు. రాజ్యసభలో మరో రెండున్నర ఏళ్ళు పదవీ కాలం ఉన్న ఉప ఎన్నికకు రేపు మంగళవారం మధ్యాహ్నం 3 గం టలతో నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యం లో..బీజేపీ అధిష్టానం తమ అభ్యర్థిగా ఖరారు చెయ్యడం విశేషము.1978నుండి RSS సభ్యునిగా 1980 లో బీజేపీ జాతీయ పార్టీ ఆవిర్భావం నుండి ఏపీలో ఆ పార్టీ సభ్యునిగా భీమవరం మునిసిపల్ కౌన్సిల్ కు 1983 నుండి వరుసగా 2 పర్యాయాలు కౌన్సిలర్ గా ఎన్నికయ్యి బీజేపీ ప్రజా ప్రతినిధిగా కాషాయ జెండాను మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాలో రెపరెప లాడించిన ఘనత పాక సత్యనారాయణ దే.. కేంద్ర స్థాయిలో షిపింగ్ కార్పొరేషన్ మరియు వైజాగ్ షిపింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కీలక స్థానాలు అధిష్టించారు. బీజేపీ లో భీమవరం టౌన్ ప్రసిడెంట్. తదుపరి జిల్లా ప్రసిడెంట్ తదుపరి స్టేట్..ఆలా కేంద్ర స్థాయి వరకు అంచెలు అంచులుగా కీలక పదవులలో ఎదిగారు. ప్రస్తుతం భీమవరం నుండే బీజేపీ ఎంపీ గా కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్న శ్రీనివాస వర్మ కు తోడుగా మరో బీజేపీ ఎంపీగా పాక సత్యనారాయణ ను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం తీర్మానించడం పశ్చిమ గోదావరి జిల్లాపై కాషాయ జెండా పట్టును మరింత బలోపేతం చేసేదిగానే భావించవచ్చు.. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా బీజేపీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా భీమవరం నుండే జిల్లాలో చక్రం త్రిప్పడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *