సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 ప్రముఖ దేవాలయాలలో స్వామిదేవేరుల సేవలో ఉండే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ తాజగా కూటమి సర్కార్ జీఓ 130 (GO 130) విడుదల చేసింది. నాయీ బ్రాహ్మణుల గౌరవ వేతనం పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీశైలంలోని శ్రీ స్వామి అమ్మవార్లకు 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
