సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోవధ నిషేధం చట్టరీత్య నేరం అని గోవద నిషేధ పోస్టర్ ను భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి, మాట్లాడుతూ.. గతంలో బక్రీద్ పర్వదినాలలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించడం జరిగిందని అయితే ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం రాష్ట్రంలో ఆవులను వధించుట నిషేధించడమైనదని, దీనిని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని,కాబ్బటి ఆవు దుడులు, పెయ్యలు, ఒంటెలను వధించుట చట్టరీత్య నేరమన్నారు. జంతువులను అక్రమ రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుశాఖ, రెవెన్యు శాఖ, పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖ మరియు మార్కెటింగ్ శాఖ వారి డివిజన్ స్థాయి, మండల కమిటీలు అప్రమత్తంగా ఉండి అక్రమముగా జంతు వధకు రవాణా కాకుండా మరియు జంతు వధ జరగకుండా చూడాలని ఆదేశించారు.. చట్టాలను ఉల్లంగించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు మురళీకృష్ణ, సుధీర్ బాబు, పుండరీ బాబు, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.
