సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాస్ సినిమాలను క్లాసిక్ రూపంలో తీసే సీనియర్ దర్శకుడు మణి రత్నం (Mani ratnam) .. లోక నాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan),కాంబినేషన్‌లో 38 ఏళ్ళ క్రితం వచ్చిన ‘నాయకుడు’(1987) చిత్రం భారతీయ సినీ చరిత్రలో అపూర్వమ్.. అల్ టైం సూపర్ హిట్.. ఆ కాంబో లో భారీ అంచనాలతో నేడు రిలీజ్ అయిన తాజా చిత్రం ‘థగ్‌లైఫ్‌’ (Thug life )లో కమల్‌ హాసన్‌, శింబు లతోపాటు త్రిష, అభిరామి, నాజర్‌, తనికెళ్ళ భరణి ఐశ్వర లక్ష్మీ నటించారు.సినిమా కధ ఏమిటంటే : చిన్నాయన అలియాస్‌ రంగరాయ శక్తిరాజు (కమల్‌ హాసన్‌) ఓల్డ్‌ ఢిల్లీలో పెద్ద డాన్‌. పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో ఓ పేపర్‌ బాయ్‌ తండ్రి మరణిస్తాడు. అతని కుమారుడు అమర్‌ (శింబు). తండ్రి మరణం, నాలుగేళ్ల చెల్లెలు మిస్‌ అయిందని తెలుసుకుని శక్తిరాజే అమర్‌ను చేరదీసి సొంత తమ్ముడిలా పెంచుతాడు. అయితే శక్తిరాజుపై జరిగిన ఓ దాడి విషయంలో అమర్‌పై అనుమానపడతాడు. తదుపరి పరిణామాలతో దూరంగా జరిగి డాన్‌గా ఎదిగిన తమ్ముడిని చూసి ఓర్వలేని ఓ అన్న, వారి మధ్య జరిగే వార్.. వెండి తెరపై చూడాలి. ఇక సినిమా ఫస్ట్ 20 నిముషాలు మాత్రమే మణిరత్నం మార్క్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అటు ఇటుగా పర్వాలేదు. ఇక సెకండ్ హాఫ్ ఒక సాధారణ సినిమాగా మారిపోయింది. కమలహాసన్ , శింబు పాత్రల మేర వారు బాగానే చేసిన వారి పాత్రలలో పీల్ ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. కథను చిన్న చిన్న మాటలతో మెస్మరైజ్‌ చేసేలా చిత్రీకరించడం మణిరత్నం బలం. కానీ ఇందులో ఆ బలం కనిపించలేదు. యాక్షన్‌ సీన్స్‌ బాగా తీశారు. త్రిష కన్నా అభిరామిది మంచి క్యారెక్టర్‌. త్రిష బార్‌ డాన్సర్‌గా రెండు పాటలు, నాలుగు సీన్స్‌లో మెరిసింది అంతే . డాక్టర్‌ అన్నాగా మంచి పాత్రలో ఐశ్వర్య లక్ష్మీ కనిపించింది. రవి కే చంద్రన్‌ కెమెరా వర్క్‌ బావుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌, నేపాల్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ షాట్స్‌ అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ సినిమాకు మైనస్‌. ఎ.ఆర్‌.రెహహాన్‌ సంగీతంలో 2 పాటలు మినహా మెరుపులు కనిపించలేదు. ఏది ఏమైనా మణిరత్నం – కమల్ కాంబినేషన్ ఈసారి గురితప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *