సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల కొన్ని వార్డులలోని కమర్షియల్ ప్రాంతాలలోదుకాణాల యజమానులకు 9121097923 (Municipal Commissioner Hari Narayan Corporation Office) మరియు కొన్ని ఇతర నెంబర్ల నుండి కమిషనర్ వారి పేరుతో ఫోన్ చేసి D&O ట్రేడ్ లైసెన్సులు రుసుము చెల్లించవలసిందిగాను, లేనిచో వారి షాపు యొక్క లైసెన్స్ రద్దు చేస్తాము అని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులు పాల్పడుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చినట్లు భీమవరం కమిషనర్ రామచంద్ర రెడ్డి తెలిపారు. కావున పట్టణంలోని ప్రజలకు మరియు అన్ని రకాల కమర్షియల్ షాపులు యజమానులకు తెలియజేయునది ఏమనగా సదరు వ్యక్తులతో పురపాలక సంఘం వారికి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తూ కమిషనర్ వారి పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు చెల్లించవలసిందిగా ఫోన్ చేస్తే తక్షణమే మీ వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ వారి ద్వారా పురపాలక సంఘ అధికారుల/ పోలిసు వారి దృష్టికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడమైనది. అదేవిధం గా మీరు చెల్లించవలసిన D&O ట్రేడ్ లైసెన్స్ బకాయిలు నేరుగా భీమవరం పురపాలక సంఘ కార్యాలయము నందున గాని లేదా మీ సమీప వార్డు సచివాలయం నందు గాని చెల్లించవలసిందిగా తెలియచేయడమైనది.కమీషనర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *