సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పట్టణంలో ఇటీవల కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డులు , డ్రైన్స్ పూర్తీ చేసి వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దానిలో భాగంగా నేడు, శుక్రవారం భీమవరం 3 టౌన్ పట్టణ శివారు లోని ప్రక్రుతి ఆశ్రయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాలలో 4 కోట్ల 53 లక్షల రూపాయలతో.. కొత్త గా నిర్మించిన 5 సిసి రోడ్లను ప్రారంభించారు. ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పనులు పూర్తీ చేస్తానని, కొత్తగా మరిన్ని కోట్లాది రూపాయలు విలువైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కు కూడా భీమవరం ప్రజలు కోసం సీఎం జగన్ ఆమోదించారని వాటిని కూడా శరవేగంగా పూర్తీ చేసి అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల, వైసిపి నేతలు వేండ్ర వెంకట స్వామి, తోట బోగయ్య తదితరులు పాల్గొన్నారు.
